చంటి ఛానల్,బోధన్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నగరేశ్వర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సిద్ధాంతి శ్రీధర్ ఆచారి పంచాంగ శ్రవణం గావించి, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, యమునా నది పుష్కరాలు జరుగుతాయని, అయితే చంద్ర, సూర్య గ్రహణాలు ఏవీ లేవని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉగాది పచ్చడిని సేవించి, అర్చక స్వాముల నుండి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధాంతి శ్రీధర్ ఆచారి, ప్రధాన అర్చకులు ఉమేష్ మహారాజ్ కు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త రాజేశ్వర్ గుప్తా, గంజి వెంకటేశం గుప్తా, ప్రదీప్ గుప్తా, కంటాల రమేష్, పబ్బ మురళి, వాసర గంగాధర్, పార్శి శ్రీధర్ గుప్తా, మాశేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

