చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ కార్డులను, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉపసర్పంచ్ అన్నపూర్ణ, అలాగే మాజీ సర్పంచ్ సంజు చేతుల మీదుగా లబ్ధిదారులకు డిజిటల్ కార్డులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయిలు, వీఆర్వో సృజన్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు, రేషన్ డీలర్ నాగేశ్వరరావుతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

