చంటి ఛానల్,నిజామాబాద్: పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల,పాఠశాలలో ఆదివారం (04/10/2026) సాయంత్రం బతుకమ్మ సంబరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలు, అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి. నరేంద్ర రెడ్డి హాజరై విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను నిత్యం అనుసరించాలని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల జోనల్ ఇన్ఛార్జ్ కె. వాసుదేవ్ రెడ్డి, ప్రిన్సిపాల్ విరత్ రావు, సుధాకర్ రెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

