చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలకంలో నిత్యం సాగే ‘కౌన్సిల్ రణరంగానికి’ తెరదించేలా ఒక బలమైన రాజకీయ భూకంపం ముంచుకొస్తోంది; ప్రత్యర్థి శిబిరంలోని నలుగురు మొదలుకుని ఏడుగురు కౌన్సిలర్లు ‘ఇక ఈ లడాయిలు మనవల్ల కాదు’ అనుకున్నారో ఏమో, దీపావళి ముగిసిన వెంటనే చల్లగా అధికార సముద్రంలో దూకేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం! “ఈ పిల్ల కాలువలు వచ్చి కలిస్తే ఇక తిరుగుండదు.. బిల్లులు, కౌన్సిల్ భేటీలు వెన్నతో పెట్టిన విద్యలా సాగిపోతాయి” అని అధికార పక్షం ముసిముసి నవ్వులు నవ్వుకుంటుండగా, జారిపోతున్న తమ వారిని స్వపక్షం కాపాడుకుంటుందా లేక చేజార్చుకుంటుందా అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సముద్రం లాంటి పార్టీలో చేరితే భవిష్యత్తు బంగారమే అనుకుని గట్టు దాటుతున్న ఈ ప్రజాప్రతినిధుల కెరీర్ ఏ తీరానికి చేరుతుందో తేలాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రచారమే నిజమైతే మాత్రం బోధన్ గడ్డపై అసలైన రాజకీయ పండగ మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
.

