చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణ హనుమాన్ ఆలయంలో బ్రాహ్మణ సేవా సమాజ్ సమావేశం జరిగింది. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి సభ్యులంతా రాజీనామా చేశారు. విడిపోయిన వర్గాలన్నింటినీ ఏకం చేసి సమాజ బలోపేతానికి సముచిత స్థానం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో నూతన కార్యవర్గ ఎన్నికల తేదీ నిర్ణయం కోసం వినోద్ పట్వారీ, చక్రవర్తి, అశోక్ కులకర్ణి, ఉమానంద్ వైద్య, శివకుమార్ బిందు, రామారావు పాఠక్, యమున తో అడ్హక్ కమిటీని నియమించారు. నెల రోజుల్లోగా సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వారు ప్రకటించారు.

