చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని అంకు టవర్స్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్‌పల్లి ఆధ్వర్యంలో సుమారు 5,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయ కుమారి, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, తహసీల్దార్ విట్టల్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రతిమలను అందజేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

