Explore

Search

November 7, 2026 6:22 pm

ఏరాజ్ పల్లిలో స్వచ్ఛత: డ్రోన్‌తో గడ్డిమందు పిచికారీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఏరాజ్ పల్లి గ్రామంలో ప్రధాన అలుగు, కాలువలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను ఇటీవల శుభ్రం చేయించిన గ్రామ పాలకవర్గం, నేడు అదే కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలను నివారించేందుకు డ్రోన్ యంత్రం ద్వారా గడ్డి మందు పిచికారీ చేయించి తమదైన శైలిలో ఆచరణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. సర్పంచ్ దాస్ గౌడ్, ఉప సర్పంచ్ సురకంటి పవన్, ఇతర పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన ఈ స్వచ్ఛత, పరిశుభ్రతా కార్యక్రమం గ్రామస్తులందరి మన్ననలు పొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్