చంటి ఛానర్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఎల్బీఎస్ నగర్ కుమ్మర గల్లీలో రెడ్డిక కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగను, ఈ ఏడాది కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిక కులస్తులు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు.

