Explore

Search

November 7, 2026 5:57 pm

​రేపు బోధన్‌లో ‘వాక్ ఫర్ యోగా’ ర్యాలీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో రేపు (ఆదివారం, జూన్ 21న) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పతంజలి ధ్యానయోగ విజ్ఞాన కేంద్రం, ఓం యోగశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం గురించి సీనియర్ యోగా మాస్టర్ మాధవి, యోగా మాస్టర్ గంగాధర్ ఓ ప్రకటనలో వివరిస్తూ.. ముందుగా ఉదయం 6:00 నుండి 7:00 గంటల వరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ‘వాక్ ఫర్ యోగా’ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉదయం 7:00 నుండి 9:00 గంటల వరకు టీటీడీ కల్యాణ మండపంలో ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే ఈ వేడుకలకు పట్టణ ప్రముఖులు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్