చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని గోశాల రోడ్డులో గంజాయి సేవిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో ముగ్గురు అనుమానితులు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజ్ ఏరియాకు చెందిన ఎండీ సాజిమ్ మంజూర్ (20), రాకాసిపేటకు చెందిన నగరం నరసింహ (23) అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బోధన్ ఎస్ హెచ్ వో వెంకటనారాయణ మాట్లాడుతూ.. వీరికి గంజాయి విక్రయించిన వారిని కూడా గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

