Explore

Search

November 7, 2026 6:12 pm

ప్రశ్నించిన చోటే సమాధానం.. బోధన్ కాంగ్రెస్ ‘ఫ్లోర్’ లీడర్‌గా శరత్ రెడ్డి పగ్గాలు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి నియామకం, స్థానిక రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రత్యర్థులకు ఒక బలమైన సమాధానంగా మారింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి చేతుల మీదుగా ఈ బాధ్యతలు చేపట్టడం ద్వారా, గతంలో “సమాధానం చెప్పడానికి నువ్వు ఎవరు?” అంటూ ఎగతాళి చేసిన విపక్షాల నోళ్లకు తన పదవితోనే చెక్ పెట్టినట్లయింది. ఈ నియామకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం రాగా, విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సాధించిన ఈ విజయం ఇప్పుడు బోధన్ పురపాలక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్