Explore

Search

November 7, 2026 6:23 pm

సీపీఐ (మావోయిస్టు) సీనియర్ నేత నక్కా సుశీల లొంగుబాటు

చంటి ఛానల్,నిజామాబాద్: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో 34 ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకురాలు, డివిజన్ కమిటీ సభ్యురాలు (DCM) నక్కా సుశీల అలియాస్ రాజీ (57) మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సుశీల 1992లో పీపుల్స్‌వార్‌లో చేరి, ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డివిజన్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ (EDC)లో పనిచేశారు. గతంలో ఎదురుకాల్పుల్లో తగిలిన తీవ్ర గాయాలు, అనారోగ్య సమస్యల రీత్యా హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమెకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చెక్కు, రూ. 25,000 తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మరియు తెలంగాణ పోలీసుల పటిష్ట చర్యల వల్ల 2026లో ఇప్పటివరకు మొత్తం 266 మంది మావోయిస్టులు (ముగ్గురు CCMలు, 12 మంది SCMలు సహా) లొంగిపోయారని, సుశీల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్ రావు (గణపతి), జడే రత్నబాయి (సుజాత), వర్ధ శేఖర్ (మంగు) అనే ముగ్గురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని స్పష్టం చేస్తూ, మిగిలిన కేడర్ కూడా లొంగిపోయి ప్రభుత్వ పునరావాస ఫలాలను అందుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్