Explore

Search

November 7, 2026 6:22 pm

బోధన్ బ్రాహ్మణ సమాజంలో ముసలం: 17 మంది రాజీనామా!

చంటి ఛానల్,నిజామాబాద్​: అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వేళ బోధన్ బ్రాహ్మణ సమాజంలో పిడుగులాంటి వార్త తీవ్ర కలకలం రేపింది! సంఘం ఆవిర్భవించి రెండేళ్లు నిండిన నేపథ్యంలో గతంలో ఏర్పడ్డ చీలికతో పుట్టుకొచ్చిన రెండో కమిటీ సైతం అంతర్గత విభేదాలతో నిలువునా బద్దలైంది; మొత్తం 22 మంది బాడీ సభ్యుల్లో ఏకంగా 17 మంది కట్టగట్టుకుని రాజీనామా అస్త్రాలు విసరడంతో సమాజ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతితో బిత్తరపోయాయి. అసలు బ్రాహ్మణ సమాజంలో ఏమైంది? బాడీ మెంబర్లు ఒక్కొక్కరిగా తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ తిరుగుబాటుకు గల అసలు కారణాలేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు బోధన్‌లో పెను సంచలనం రేపుతూ సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్