చంటి ఛానల్,సాలూర: ఆర్జీయూకేటీ (RGUKT) బాసర రెండో విడత ఫలితాలలో సాలూర ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థిని ఎం. వైష్ణవి (తండ్రి హనుమంతు, సుంకిని గ్రామం) సీటు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్ లతారాజు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని ప్రతిష్టాత్మక ఐఐఐటీలో సీటు సాధించడం పట్ల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

