చంటి ఛానల్, బోధన్: సిద్దిపేటలో జరిగిన 70వ ఎస్జీఎఫ్ (SGF) తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో బోధన్‌కు చెందిన ‘ఓం యోగశాల’ విద్యార్థులు ఆర్టిస్టిక్, ట్రెడిషనల్,రిథమిక్ యోగా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 4 కాంస్య (బ్రాంజ్) పతకాలు సాధించారు; ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను ఓం యోగాశాల గురువు, వ్యవస్థాపకుడు యోగా మాస్టర్ కె. గంగాధర్ ప్రత్యేకంగా అభినందించగా, స్థానికులు మరియు పట్టణ ప్రముఖులు కూడా విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

