Explore

Search

November 7, 2026 6:07 pm

స్కూల్ బస్సుల భద్రతపై రాజీ వద్దు: ఆర్టీఏకు బి.వి.ఎస్ వినతి

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బి.వి.ఎస్ పట్టణ అధ్యక్షుడు కస్పలింగం మాట్లాడుతూ.. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ బాక్స్, మెడికల్ కిట్ వంటి కనీస భద్రతా ప్రమాణాలు లేని బస్సులకు అనుమతులు ఇవ్వరాదని, అలాగే విద్యార్థులు బస్సులో ఉండగా పెట్రోల్ బంకులకు వెళ్లే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిక్కం ప్రవీణ్, పంజాబ్ సింగ్, ఆకాష్ తదితర బి.వి.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్