Explore

Search

November 7, 2026 5:57 pm

దర్గా వద్ద భారీ సమావేశం.. 100 స్తంభాల గుడికి ముప్పు ఉందంటూ బీజేపీ సంచలన లేఖ!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రాత్మక 100 స్తంభాల (ఇంద్ర నారాయణ స్వామి) దేవాలయ రక్షణపై బీజేపీ తెలంగాణ ధార్మిక సెల్ అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ఆలయానికి ఆనుకుని ఉన్న దర్గా వద్ద భారీ జనసమీకరణ జరగనున్న నేపథ్యంలో, పురావస్తు శాఖ ఆధీనంలోని ఈ కట్టడం చుట్టూ తక్షణమే కంచె వేసి, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 24 గంటల్లోగా అధికారులు స్పందించి భద్రతా చర్యలు చేపట్టకపోతే శాంతిభద్రతల బాధ్యత వారిదేనని స్పష్టం చేసింది. తక్షణమే రక్షణ చర్యలు ప్రారంభించకపోతే న్యాయపోరాటానికి దిగుతామని సెల్ కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ నవీన్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్