చంటి ఛానల్,బోధన్: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బోధన్ పట్టణంలో పెరుగుతున్న గంజాయి విక్రయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల నుండి వస్తున్న ఈ గంజాయి మహమ్మారి ప్రస్తుతం పాన్ షాపుల్లో కూడా సులభంగా దొరికే స్థాయికి చేరిందని, ఇది చదువుకోవాల్సిన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆందోళన చెందారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని, గంజాయి స్థావరాలపై ఉక్కుపాదం మోపి ఈ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

