చంటి ఛానల్,బోధన్: జనాభా లెక్కల సేకరణలో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్లైన్లో నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని బోధన్ తహశీల్దార్ విఠల్ ఒక ప్రకటనలో కోరారు. మే 10వ తేదీ వరకు https://se.census.gov.in వెబ్సైట్లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే 11 అంకెల SE IDని భద్రపరుచుకోవాలని, మే 11 తర్వాత ఇంటికి వచ్చే గణన అధికారులకు ఈ ఐడిని చూపిస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

