చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన లైన్మెన్ శివను 15వ వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు కలిసి స్థానిక సబ్-స్టేషన్ వద్ద శాలువాతో ఘనంగా సన్మానించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ప్రాణనష్టం కలగకుండా విద్యుత్ స్తంభాల వద్ద వైర్లకు తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించి, సమస్యలున్న చోట బాధ్యతాయుతంగా వ్యవహరించిన శివ పనితీరును ఈ సందర్భంగా కౌన్సిలర్ అశోక్ రెడ్డి కొనియాడుతూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

