చంటి ఛానల్,బోధన్: నిషేధిత కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా నారింజ పండ్లను పండించి విక్రయిస్తున్న స్థానిక ‘మిలాఫ్ ఫ్రూట్ మర్చంట్’ యజమాని మునవర్ ఉద్దీన్‌కు బోధన్ న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ. O5 వేల జరిమానా విధించింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఫుడ్ సేఫ్టీ (FSSAI) నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రతా అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

