Explore

Search

November 7, 2026 6:12 pm

ఖండ్గావ్ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సాయం.

చంటి ఛానల్,బోధన్: ఖండ్గావ్ రైతు మీసాలే ముకుంద్ విద్యుత్ షాక్‌తో మరణించగా, ఆయన కుటుంబానికి JPA ఇన్సూరెన్స్ కింద రూ. 2,00,000/- ఆర్థిక సాయం అందింది. కల్దుర్కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఈ మొత్తాన్ని మృతుడి భార్య మీసాలే రమాబాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శ్రీనివాస్ చారి, బ్యాంకు మేనేజర్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. పంట రుణాలు సకాలంలో రెన్యువల్ చేసుకునే రైతులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని, సంఘ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్