చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు సమ్మె సన్నాహకాల్లో భాగంగా నేడు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు డిపో వద్ద గేట్ మీటింగ్, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర JAC నాయకులు థామస్ రెడ్డి, AR రెడ్డి పాల్గొని ప్రసంగించగా, జిల్లా నాయకులు వందేమాతరం శ్రీనివాస్, మాక్లూర్ శేకర్, సాయిలు, D. సంజీవ్, గంగారాంలతో పాటు డిపో ప్రతినిధులు సంజీవ్ రెడ్డి, కొండలరావు, పోతారెడ్డి, GN గౌడ్, అనీఫ్, ముఖీమ్, బాబూరావు, యాదగిరి, నవీన్, కిషోర్, మజీద్ సహా సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మెకు అందరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

