చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలక సంఘం పరిధిలోని అచ్చంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ (2-BHK) ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో కలెక్టర్ ఖరారు చేసిన అర్హుల జాబితాను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించడాన్ని సవాలు చేస్తూ షేక్ ముషీర్, ఫర్హా బేగం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. లక్కీ డ్రా నోటీసుపై రెండు వారాల పాటు స్టే విధిస్తూ, పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేశారు.

