చంటి ఛానల్,బోధన్ : నేడు శనివారం (మార్చి 21, 2026) నాఫెడ్, కల్దుర్కి సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డీసీసీ డెలిగేట్ గంగ శంకర్, AMC చైర్మన్ చీల శంకర్, వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, గణపతి రెడ్డి, ప్రకాష్ పటేల్, కల్దుర్కి సర్పంచ్ నరేందర్ రెడ్డి, రాంపూర్ సర్పంచ్ డోలే సాయికుమార్, కంటే సాయికుమార్ ఉపసర్పంచ్, సిద్దాపూర్ సర్పంచ్, ఇతర గ్రామాల సర్పంచులు, సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, సంఘ కార్యదర్శి శ్రీనివాస్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనగ దిగుబడి 7.5 క్వింటాళ్ల నుండి 10 క్వింటాళ్లకు పెంచాలని, కౌలునామా విధానం ద్వారా శనగలు కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

