Explore

Search

November 7, 2026 6:07 pm

విద్యార్థులకు గుడ్ న్యూస్: ఉచితంగా ‘ఒకినావా కరాటే’ శిక్షణ

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల (G.H.S.J.C) ఆవరణలో మే 2వ తేదీ నుండి నెల రోజుల పాటు ఉచిత కరాటే శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సీనియర్ కరాటే మాస్టర్ అశోక్ కుమార్ రోడే  ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుండి 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలకు ప్రతిరోజూ సాయంత్రం 5:45 గంటల నుండి 6:45 గంటల వరకు ఎటువంటి ఫీజు లేకుండా ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. ఒకినావా కరాటే సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో కరాటేతో పాటు విద్యార్థులకు మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం మరియు చదువుపై ఏకాగ్రత పెంచేలా గైడెన్స్ & కౌన్సిలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాలకు 9848121160, 9493930609, 9989514377 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ఆదివారం శిబిరానికి సెలవు ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్