Explore

Search

November 7, 2026 6:11 pm

భయపడిన దొంగ.. చెత్తబుట్టలో ప్రత్యక్షమైన రిజిస్టర్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ స్థానిక GHS (JC) పాఠశాలలో గత 45 రోజులుగా అదృశ్యమైన అడ్మిషన్ రిజిస్టర్ ఎట్టకేలకు గురువారం స్కూల్ ప్రాంగణంలోని మిడ్ డే మీల్స్ భవనం మెట్ల కింద ఉన్న చెత్తబుట్టలో లభ్యమైంది. మే 12న డీఈవో ఆఫీస్ నుండి తిరిగి స్కూల్ కు తెచ్చిన తర్వాత ఈ రిజిస్టర్ మాయమైంది. అయితే, ఈ వ్యవహారంపై వార్తా కథనాలు రావడంతో భయపడిన దొంగే.. గుట్టుచప్పుడు కాకుండా ఆ రిజిస్టర్‌ను చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయి ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రిజిస్టర్ తిరిగి దొరకడంతో పాఠశాలలో నెలకొన్న గందరగోళానికి ప్రస్తుతానికి తెరపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్