Explore

Search

November 7, 2026 6:12 pm

​”తల్లిదండ్రుల ఆశీస్సులతో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ”

చంటి ఛానల్,బోధన్ : ​శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం “తల్లిదండ్రులకు వందనం” కార్యక్రమం నిర్వహించి, వారి తల్లిదండ్రుల సమక్షంలో హాల్ టికెట్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రుల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కృష్ణమోహన్ తెలిపారు. ఈ వేడుకలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ. శేషతల్ప సాయి, యోగ మాస్టారు బి. సాయిలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా చదువుపై దృష్టి పెట్టాలని, క్రమశిక్షణతో మెలగి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్