చంటి ఛానల్,బోధన్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఏ. (ఎడ్యుకేషన్), డిప్లొమా ఇన్ ECCE కోర్సుల్లో ప్రవేశాలకు బోధన్‌లోని ఇందూరు బీఈడీ కళాశాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. అప్పలనాయుడు తెలిపారు. అంగన్‌వాడీ, ప్రైమరీ టీచర్ అర్హతలకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయని, ఆసక్తిగల అభ్యర్థులు www.braouonline.in ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్లను కళాశాలలో సమర్పించాలని కోరారు. వివరాలకు 9440140118 నంబరును సంప్రదించవచ్చు.

