Explore

Search

November 7, 2026 6:58 pm

​”మద్యం మత్తులో బస్సు బీభత్సం.. 194 పాయింట్ల రీడింగ్‌తో షాక్!”

చంటి ఛానల్,బోధన్: రుద్రూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉండగా, బస్సు డ్రైవర్ బాలగౌడ్ మద్యం మత్తులో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని నిర్ధారణ అయింది. డ్రైవర్‌కు నిర్వహించిన ఆల్కహాల్ టెస్టులో ఏకంగా 194 పాయింట్ల రీడింగ్ నమోదు కావడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరికి కాలు విరగగా, మరో ముగ్గురికి కింది దౌడ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. 33 మంది ప్రాణాలను పణంగా పెట్టిన డ్రైవర్ బాధ్యతారాహిత్యంపై మరియు పర్యవేక్షణ లోపం ఉన్న ఆర్టీసీ అధికారులపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్