చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ వెజిటేబుల్ మార్కెట్లో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ షాపులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ యూనియన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కు వినతిపత్రం ఇచ్చారు. నిజమైన కూరగాయల వ్యాపారులకే, ఒక కుటుంబానికి ఒక షాపు చొప్పున కేటాయించాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అర్హులకు షాపులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

