చంటి ఛానల్,నిజామాబాద్: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., పిలుపునిచ్చారు. బోధన్‌లో నిర్వహించిన ముస్లిం మత పెద్దల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ వేళ సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని, ప్రార్థనా స్థలాల వద్ద భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించి సామరస్యంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, ఏసీపీలు మరియు స్థానిక మత పెద్దలు పాల్గొన్నారు.

