చంటి ఛానల్ ,నిజామాబాద్: బోధన్‌లో ఇసుక మాఫియా బరితెగించి రెవెన్యూ అధికారులపైనే హత్యాయత్నానికి ఒడిగట్టింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టేందుకు వెళ్లిన ఆర్‌ఐ నాగేశ్వరరావును అడ్డుకున్న డ్రైవర్ హైదర్, తన వాహనాన్ని నేరుగా ఆయనపైకి దూసుకెళ్లించాడు. ఈ ప్రమాదకర దాడిలో ఆర్‌ఐ నాగేశ్వరరావు చేతికి తీవ్ర గాయాలవ్వగా, ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపైనే దాడులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్ హైదర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతుండటంతో, ఇకపై అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

