Explore

Search

November 7, 2026 6:12 pm

​శ్రీ మారుతి ఆలయంలో ఘనంగా ఆషాఢ పాండురంగ ఏకాదశి

చంటి ఛానల్,బోధన్: ఆషాఢ పాండురంగ ఏకాదశి సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారికి ప్రత్యేక పూజలు, కాకడ హారతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో, దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎన్. రాములు పర్యవేక్షణలో జరిగిన ఈ పూజల్లో 15వ వార్డు నాయకులు గుమ్ముల అశోక్ రెడ్డి, బోధన్ విడీసీ కార్యవర్గ సభ్యులు శేఖర్‌తో పాటు స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి ప్రత్యేక హారతి, మంత్రపుష్పం స్వీకరించి, తీర్థప్రసాదాలు పొంది ఆశీస్సులు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్