Explore

Search

November 7, 2026 6:23 pm

పదవి పంపకం చట్టవిరుద్ధం: బోధన్ బార్ ఎన్నికల వివాదానికి తెరదించిన హైకోర్టు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 ఎన్నికల వివాదంపై తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. చెల్లుబాటయ్యే ఓటును తిరస్కరించడం, ఆరు నెలల చొప్పున ఇద్దరు అభ్యర్థులు పదవిని పంచుకోవాలనడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, సామయ్య పి.ని చట్టబద్ధమైన ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడిన నేపథ్యంలో బోధన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. గంగారెడ్డి, బార్ అసోసియేషన్ కోశాధికారి బానోత్ రమేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రాఘవేందర్, అనిల్ కుమార్, న్యాయవాదులు ఎస్.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, శ్రీమతి కళ్యాణి తదితరులు పాల్గొని సామయ్య కి అభినందనలు తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్