చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి యజమానులకు మున్సిపల్ యంత్రాంగం ఒక చక్కని అవకాశాన్ని కల్పించింది; 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా, అంటే ఏప్రిల్ 30, 2026 లోపు చెల్లించే వారికి పన్ను మొత్తంలో 5 శాతం రాయితీని ప్రకటించింది. పట్టణ అభివృద్ధికి సహకరించే ఉద్దేశంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్ ద్వారా https://cdma.cgg.gov.in లింక్ ఉపయోగించి లేదా మున్సిపల్ కార్యాలయంలో పన్ను చెల్లించి ఈ డిస్కౌంట్ పొందవచ్చని కమిషనర్, చైర్‌పర్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.

