చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ వాస్తవ్యుడు ఉదయ్ మహారాజ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ రాష్ట్ర కమిటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేతుల మీదుగా ఆయన అందుకుని తన నూతన బాధ్యతలను స్వీకరించారు. ఈ విషయం తెలుసుకున్న బోధన్ పట్టణ, నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆయనకు విశేషంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ మహారాజ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఎండోమెంట్ సెల్ వారు అప్పగించిన ఈ కీలక బాధ్యతను పూర్తి చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, ప్రజా ప్రయోజనాలకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

