Explore

Search

November 7, 2026 6:11 pm

యూరియా ‘లింక్’ రైతుల మేలుకే: ఏవో శ్వేత

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం వచ్చే రైతులపై అదనపు ఉత్పత్తుల (సాగరిక, నానో యూరియా/డీఏపీ) కొనుగోలును బలవంతంగా రుద్దుతున్నారన్న వార్తలపై వ్యవసాయ అధికారి (ఏవో) శ్వేత స్పందించారు. యూరియా కొరతను నివారించి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే, ప్రైవేట్ కంపెనీల నిబంధనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సొసైటీల్లో ఈ ‘లింకింగ్’ విధానం అమలవుతోందని ఆమె ‘చంటి ఛానల్’కు వివరించారు. యూరియాతో పాటు ఇస్తున్న అదనపు ఉత్పత్తులు రైతుల పంటలకు ఎంతో ఉపయోగపడేవేనని ఆమె స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు అలవాటు చేసి, వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచే క్రమంలోనే ఈ లింకులు పెడుతున్నామని, ఈ వాస్తవాన్ని రైతులు సానుకూలంగా అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్