Explore

Search

November 7, 2026 6:10 pm

130 మంది చిన్నారులతో సందడిగా సాగిన VBS శిబిరం: ఆధ్యాత్మిక మార్గంలో చిన్నారులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ శక్కర్ నగర్‌లోని CSI సెయింట్ పాల్ చర్చిలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన వేసవికాలం బైబిల్ తరగతులు (VBS) అత్యంత ఉత్సాహంగా ముగిశాయి. చిన్నారుల్లో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 130 మంది విద్యార్థులు పాల్గొని బైబిల్ పాఠాలను, కీర్తనలను నేర్చుకున్నారు. ఈ మూడు రోజుల పాటు పిల్లలందరికీ భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవ. యం. ప్రభాకర్, రెవ. స్టీవెన్ అనీల్, రాజు పాల్గొని చిన్నారులకు దైవబోధన చేశారు. సండే స్కూల్ సెక్రెటరీ సెమిన్స్, టీనాతో పాటు కమిటీ పెద్దలు ఏడ్వార్డ్ ముల్లర్, జ్యోతిరాజ్, పుష్పరాజ్, బెనహర్,ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్