Explore

Search

November 7, 2026 6:44 pm

జనాభా లెక్కల స్వీయ గణనను సద్వినియోగం చేసుకోండి: బోధన్ తహశీల్దార్ విఠల్

చంటి ఛానల్,బోధన్: జనాభా లెక్కల సేకరణలో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని బోధన్ తహశీల్దార్ విఠల్ ఒక ప్రకటనలో కోరారు. మే 10వ తేదీ వరకు https://se.census.gov.in వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే 11 అంకెల SE IDని భద్రపరుచుకోవాలని, మే 11 తర్వాత ఇంటికి వచ్చే గణన అధికారులకు ఈ ఐడిని చూపిస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్