చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో జరగనున్న మహా శివరాత్రి జాతర – 2026 ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో సోమవారం సీల్డ్ కొటేషన్లను విప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో రాములు, పలువురు కొటేషన్ దారులు పాల్గొన్నారు. వివిధ పనులకు సంబంధించి తక్కువ ధర పేర్కొన్న కొటేషన్లను అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా రంగుల కోసం ₹95,300, క్యూ లైన్లకు ₹38,000, లైటింగ్ & సౌండ్ సిస్టంకు ₹78,000, పువ్వుల అలంకరణకు ₹24,116,టెంట్ల కోసం ₹35,000 విలువైన కొటేషన్లను ఖరారు చేశారు. ఈ ఎంపిక చేసిన జాబితాను తుది ఆమోదం కోసం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఈవో తెలిపారు.

