చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని పాన్ గల్లి నివాసితులైన పందిరి లక్ష్మి లింగం కుటుంబ సభ్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక శ్రీ ఏక చక్రేశ్వర గోశాల నిర్వహణకు గాను వారు 3100/- రూపాయల ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గోశాల కమిటీ సభ్యులు లక్ష్మి లింగం కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ గోమాత ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోశాల ఉపాధ్యక్షులు వాసర గంగాధర్, కమిటీ సభ్యులు కిషన్, హన్మండ్లు, స్వామి, చరణ్ తదితరులు పాల్గొని దాతలను అభినందించారు.

