చంటి ఛానల్,హైదరాబాద్: పుణ్యం కోసం గోవులకు ఆహారం తినిపించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ హెచ్చరిస్తోంది. ఆవుల జీర్ణవ్యవస్థ మానవుల కంటే భిన్నంగా ఉంటుందని, మనం తినే అన్నం, రొట్టెలు, వడలు, గారెలు, పులిహోర మరియు పరమాన్నం వంటి పదార్థాలు ఆవులకు అరగవని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ నిపుణులు తెలిపారు. భక్తులు తమ పుణ్యం కోసం పెట్టే ఇటువంటి ఆహార పదార్థాలు గోవుల మరణానికి కారణమవుతున్నాయని, ఇది గోహత్యా పాతకానికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులకు మేలు చేయాలనుకునే వారు సుమారు 25 కిలోల పచ్చి గడ్డిని తినిపించడం ద్వారా నిజమైన పుణ్యాన్ని సంపాదించుకోవాలని అధికారులు సూచించారు.

