Explore

Search

November 7, 2026 7:16 pm

రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి: బోధన్ ట్రాఫిక్ ఎస్సై

చంటి ఛానల్,బోధన్: రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ ట్రాఫిక్ ఇంచార్జ్ ఎస్సై మహేష్ సూచించారు. జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని బస్టాండ్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో AMVI పండరి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్