Explore

Search

November 7, 2026 7:08 pm

మున్సిపల్ పీఠం ‘అన్‌రిజర్వ్‌డ్’.. జనరల్ కేటగిరీలో పోరుకు రంగం సిద్ధం!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది; అందరూ ఊహించినట్లుగానే బోధన్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ‘అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)’ గా ఖరారు చేశారు. నేడు విడుదలైన వార్డుల వారీ రిజర్వేషన్ల సరళిని బట్టి ముందే అంచనా వేసినట్లుగానే, చివరికి అధికారికంగా జనరల్ కేటగిరీకే మున్సిపల్ పీఠాన్ని కేటాయించారు. ఈ ప్రకటనతో బోధన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులైనా ఇప్పుడు చైర్మన్ పీఠం కోసం పోటీ పడే అవకాశం ఉండటంతో, రాజకీయ పార్టీల్లోని హేమాహేమీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అన్నట్లుగా, బోధన్ మున్సిపల్ బాద్‌షా అయ్యేందుకు తెర వెనుక పావులు కదులుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్