Explore

Search

November 7, 2026 6:22 pm

మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ పరిధిలోని 01 నుండి 38 వార్డులకు సంబంధించి ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను సోమవారం (12.01.2026) అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ జాబితాను ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 69,426 కాగా, ఇందులో పురుషులు 33,697 మంది, మహిళలు 35,728 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఈ జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయం, సబ్-కలెక్టర్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల నోటీసు బోర్డులపై అందుబాటులో ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్