Explore

Search

November 7, 2026 6:22 pm

బీఆర్ఎస్ వైపు ముషీర్ బాబా చూపు: బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

చంటి ఛానల్,బోధన్: రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఎంఐఎం పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్, అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా గుర్తింపు పొందిన ముషీర్ బాబా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పట్టణంలో బలమైన పట్టున్న ముషీర్ బాబా పార్టీ మారడంపై ప్రస్తుతం పట్టణంలో సర్వత్ర చర్చ మొదలైంది. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, ఎంఐఎం వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్