చంటి ఛానల్,బోధన్: సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ ఊర్లకు వెళ్లేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ సూచించారు. విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని ఆయన కోరారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

