చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని అంకు టవర్స్ (Anku Towers) అంబేద్కర్ చౌరస్తా లో నేడు సినీ గ్లామర్ మెరవనుంది! ఇక్కడ నూతనంగా కొలువుదీరిన ‘విజయ్ కలర్ ల్యాబ్’ భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం 06:00PM గంటలకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు ఈటీవీ జబర్దస్త్ స్టార్స్ బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్ బృందం విచ్చేసి సందడి చేయనుండగా, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. విజయ్ స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ దేవి నేతృత్వంలో జరుగుతున్న ఈ వేడుకలో జబర్దస్త్ టీం కామెడీ పంచ్‌లు, ఫోటోగ్రఫీ ప్రేమికుల కోలాహలంతో అంకు టవర్స్ పరిసరాలు పండుగను తలపించనున్నాయి. ఈ అద్భుత కార్యక్రమానికి పట్టణ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎండి అనుపమ దేవి ప్రత్యేకంగా కోరారు.

