Explore

Search

November 7, 2026 6:11 pm

బోధన్ చైతన్యలో వసతులు నిల్.. ఫీజులు ఫుల్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొంది మోసపోవద్దని ఏఐఎస్బీ (AISB) విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హెచ్చరించారు. స్థానిక ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాల డైరెక్టర్ కిషన్ అడ్మిషన్ల సమయంలో స్కాలర్‌షిప్ వస్తుందని చెప్పి, ఆ తర్వాత పరీక్షలు, ఇతర టెస్టుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమని, ట్రైనింగ్‌కు పంపబోమని భయాందోళనలకు గురిచేస్తున్నారని, అలాగే కళాశాలలో కనీస వసతులు, భద్రత లేకపోగా ర్యాగింగ్ సైతం ఎక్కువగా ఉందని మండిపడ్డారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించాలని, ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ముందస్తుగా ఫీజుల వివరాలపై రాతపూర్వక అగ్రిమెంట్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ నాయకులు రాజన్న, సురేష్, మోహన్, గంగ ప్రసాద్, శీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్